Divitimedia
Andhra PradeshBusinessHyderabadInternational NewsLife StyleSpot NewsTelanganaTravel And TourismWomenYouth

పెద్దమ్మతల్లికి రూ.15లక్షల రథం విరాళం

పెద్దమ్మతల్లికి రూ.15లక్షల రథం విరాళం

ప్రత్యేక పూజలు చేసి సమర్పించిన కిలారు కుటుంబం

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

భద్ఫాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురంలోని ‘పెద్దమ్మ తల్లి’ ఆలయానికి ప్రవాస భారతీయులు (యూఎస్ఏ) శ్రీవెన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కిలారు రాజశేఖర్ కుటుంబ సభ్యులు రూ.15 లక్షల విలువైన రథం విరాళం సమర్పించారు. ఈమేరకు వారు నిర్వహిస్తున్న “కిలారు ఛారిటబుల్ ట్రస్ట్” తరపున కుటుంబ సభ్యులు కిలారు బోసు, హైమావతి, డాక్టర్.కిలారు రాజశేఖర్, ప్రతిమ, రిషిక్, రిషిత ఆ రథం పెద్దమ్మతల్లికి సోమవారం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. బూర్గంపాడు మండలం పినపాకపట్టీననగర్ గ్రామానికి చెందిన డాక్టర్.కిలారు రాజశేఖర్ తమ కుటుంబంతో అమేరికాలో నివసిస్తూ, పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయన కుటుంబం తమ స్వస్థలమైన పినపాక పట్టీనగర్ గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల ఇలవేల్పు, లక్షలమందికి ఆరాధ్యదేవతగా విలసిల్లే పెద్దమ్మతల్లికి భక్తితో తమవంతుగా రథం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బందితోపాటు స్థానిక భక్తులు పలువురు పాల్గొన్నారు.

Related posts

కొత్తగూడెంలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు

Divitimedia

బూర్గంపాడు పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ

Divitimedia

పోలీసులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

Divitimedia

Leave a Comment