Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsWELFAREWomenYouth

వైద్యఖర్చులకోసం ఇద్దరికి మేవా ఆర్థికసాయం

✍️ దివిటీ మీడియా (బూర్గంపాడు)

బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్(మేవా) వెల్ఫేర్ సొసైటీ’ ఆధ్వర్యంలో బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ఇద్దరికి వైద్యఖర్చుల కోసం సోమవారం రూ.20000 ఆర్థిక సాయం అందజేశారు. గత కొంతకాలంగా ఎండి.మహుముద్దీన్ ఖాన్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ భద్రాచలంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ ఖర్చుల కోసం ఆర్థికసాయం చేయాలని అతని కుటుంబసభ్యులు మేవాకమిటీని సంప్రదించగా మహుముద్దీన్ ఖాన్ కు రూ.10వేలు అందజేశారు. ఈ మండలం పరిధిలోని కోయగూడెం పంచాయతీకి చెందిన షేక్ యాకూబ్ ప్రమాదవశాత్తు కింద జారిపడి అనారోగ్యంతో బాధపడు తూ వైద్యం చేయించుకుంటున్నారు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి గమనించి మేవా కమిటీ తరఫున రూ.10వేలు సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేవా సంస్థ అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా, ప్రధానకార్యదర్శి జహీర్ భాషా, సోహెల్ పాషా, సైదుద్దీన్, అక్బర్, అబ్దుల్ సలీం, అజీజ్, ఉస్మాన్, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షకు అనూహ్య స్పందన

Divitimedia

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Divitimedia

వేడుకగా ఐటీసీ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్‌భద్రా ఇన్‌స్టాలేషన్

Divitimedia

Leave a Comment