Divitimedia
AMARAVATHIAndhra PradeshBusinessCrime NewsLife StyleNational NewsSpot NewsTelangana

లంచం కేసులో బీఐఎస్ జేడీని అరెస్ట్ చేసిన సీబీఐ

లంచం కేసులో బీఐఎస్ జేడీని అరెస్ట్ చేసిన సీబీఐ

✍️ అమరావతి – దివిటీ (మార్చి 31)

ఆంధ్రప్రదేశ్ లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ రూ.70వేలు లంచం తీసుకుంటూ సోమవారం సీబీఐ చేతికి చిక్కారు. సిలిండర్ కు బీఐఎస్ మార్క్ కోసం ఓ తయారీ కంపెనీ దరఖాస్తు చేసుకోగా, రమాకాంత్ లంచం డిమాండ్ చేశారు. కంపెనీ ప్రతినిధులు అతడిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏపీలో విజయవాడ ఆటోనగర్ లో ఉన్న బీఐఎస్ కార్యాలయం కేంద్రంగా ఈ ప్రాంతంలో నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసుతో సంబంధముందనుకుంటున్న లక్ష్మీనారాయణరెడ్డి అనే మరో వ్యక్తిని కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

Related posts

ఐటీసీ ఎన్నికల్లో భారీమెజార్టీతో ఐఎన్టీయూసీ విజయం తథ్యం

Divitimedia

అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Divitimedia

గాడి తప్పిన పాలన… అవుతోంది హేళన…

Divitimedia

Leave a Comment