Divitimedia
Spot News

కర్రలతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి

కర్రలతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి…

శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిపై తోటి విద్యార్థుల ఘాతుకం

✍️ దివిటీ మీడియా (హైదరాబాద్)

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న కామారెడ్డికి చెందిన అభిషేక్ మీద తోటి విద్యార్థులు దాడిచేసి తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం సృష్టిస్తోంది. బాధితుడి తల్లిదండ్రులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి సమయంలో జరిగినట్లు చెప్తున్న ఈ దారుణ ఘటనలో హాస్టల్లో అభిషేక్‌ మీద దాడి చేసిన 12 మంది విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి దారుణంగా హింసించారు. అతను
తీవ్రంగా గాయపడటంతో యాజమాన్యం ఆ విద్యార్థి మెట్ల పైనుంచి కిందపడినట్లు అతని తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చినట్లు చెప్తున్నారు. వెంటనేవెళ్లి తమ తమ కొడుకును ఇంటికి తీసుకొచ్చామని ఆ బాలుడి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ర్యాగింగ్ పేరుతో తన సీనియర్ విద్యార్థులు తనపై దాడిచేసి కొట్టారని అభిషేక్ తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కొడుకుపై దాడి చేసిన వారిపైన, ఈ ఘటన బయటకు రాకుండా దాచిపెట్టిన స్కూల్ మేనేజ్ మెంట్ మీద కూడా కఠినచర్యలు తీసుకోవాలని బాధిత బాలుడి తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Divitimedia

పేద రోగికి నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

Divitimedia

బాధ్యతలు స్వీకరించిన ఓఎస్డీ, భద్రాచలం ఏఎస్పీ

Divitimedia

Leave a Comment