Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamLife StyleNational NewsPoliticsSpot NewsTelangana

నాలుగు పథకాలకు రూ.45వేల కోట్లు

నాలుగు పథకాలకు రూ.45వేల కోట్లు

ఆర్థికభారం అయినా మావి చరిత్రాత్మక నిర్ణయాలు

ప్రభుత్వ పథకాల అమలుపై ఖమ్మంలో భట్టి, మంత్రులు

✍️ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జనవరి 13)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబోతున్న నాలుగు పథకాల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు వెల్లడించారు. తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రభుత్వ పథకాల అమలు విషయంలో భేష్ అనిపించుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ అంశాలపై సోమవారం ఖమ్మ కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డెప్యూటీ సీఎం భట్టితోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో భట్టి మాట్లాడుతూ, ‘రైతు భరోసా’కు రూ.18 వేల కోట్లు, ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి రూ.22,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ఎన్నికల సందర్భంగా తామిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి, ఆర్.అండ్.బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, అధికారులు బాధ్యతగా క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను మాత్రమే ఎంపిక చేయాలని, ఎక్కడా లోపాలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 26 నుంచి చేపట్టనున్న రేషన్ కార్డుల జారీలో మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కువ మందికి లబ్దిచేకూరేలా చూస్తున్నామని తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతుభరోసా పథకానికి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ తమ అభిప్రాయాలతో సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జి.వి.పాటిల్, ఖమ్మం సీపీ సునీల్ దత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, రెండు జిల్లాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎన్టీయూసీ వినతి

Divitimedia

పంచమని చెప్తే… వృధాగా పడేశారు…

Divitimedia

పినపాక నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన

Divitimedia

Leave a Comment