వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎన్టీయూసీ వినతి
✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు (మే 2)
గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ఐటీసీ పీఎస్పీడీలో పనిచేసే కార్మికుల రక్షణ కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ప్రతినిథులతో కలిసి విన్నవించింది. ఈ మేరకు యూనియన్ ప్రతినిథి బృందం ఆ సంస్థ జనరల్ మేనేజర్ (మానవ వనరులు) శ్యాంకిరణ్ కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. కార్మికులకు పరిశ్రమలో అన్ని ప్రదేశాల్లో మజ్జిగ పంపిణీ చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. అదేవిధంగా షట్ డౌన్ సమయాలు కూడా మార్పుచేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి, ఎం.ఆర్.ఎస్.బి రెడ్డి, గంజి వీరభద్రరావు, కప్పెర వెంకటరమణ, చింతల వినోద్ కుమార్, గొలమారి చంద్రశేఖర్, సాయిరామ్, బి.ఎస్.ఎస్ సూర్యనారాయణ, విశ్వనాథ్ రెడ్డి, పూర్ణచంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

