Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsLife StyleSpecial ArticlesTelangana

చేతకావడం లేదంటూ… చేతులెత్తేస్తున్నారు…

చేతకావడం లేదంటూ… చేతులెత్తేస్తున్నారు…

వేలంపాటలో హెచ్చరిక… ఇప్పుడేమీ చేయలేక…

మోరంపల్లిబంజర సంత నిర్వహణలో
ఇష్టారాజ్యం

✍️ దివిటీ మీడియా (సెప్టెంబరు 10)

నిబంధ‌న‌ల విషయంలో నిప్పులమంటూ వేలంపాట సమయంలో హెచ్చరికలు చేసిన అధికారులు, తీరా ఆ నిబంధ‌న‌లు అమలు చేయలేని పరిస్థితులలో జనం అయోమయానికి గురవుతున్నారు… అసలింతకీ ఈ సంత నిర్వహణలో నిబంధ‌న‌లమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎవరిదో మరి…?. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మోరంపల్లిబంజర సంత నిర్వహణ విషయంలో అధికారులు దోబూచులాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతిపెద్ద సంతగా పేరున్న మోరంపల్లిబంజర వారపుసంత నిర్వహణ తీరు వివాదాస్పదంగా మారి అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. ప్రతి గురు, శుక్రవారాల్లో రెండురోజుల పాటు నిర్వహించుకునేలా ఈ సంతకు వేలంపాట నిర్వహించారు. గురువారం పశువుల క్రయవిక్రయాలు, శుక్రవారం కూరగాయలు, ఇతర సరకుల క్రయ విక్రయాలు జరిగే విధంగా ఈ సంత నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ సంత వేలంపాట జరిగిన సమయంలోనే వివాదాల నడుమ ప్రతి వారం రెండు రోజుల పాటు మాత్రమే ఇక్కడ లావాదేవీలకు అనుమతులిచ్చిన అధికారులు, నిబంధ‌న‌లను కఠినంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిబంధ‌న‌లకు విరుద్ధంగా వేరే రోజుల్లో సంత కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు కూడా. చేశారు. కానీ ఈ నిబంధ‌న‌లకు వ్యతిరేకంగా ఇక్కడ సంత ప్రతి బుధవారం కూడా నిర్వహిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. గడిచిన ఐదు నెలలుగా ఇది కొనసాగుతోంది. ఈ దుస్థితిపై ఎవరైనా ప్రశ్నించినప్పుడు కాస్త హడావిడి చేస్తున్న అధికారులు, తర్వాత ఏమీ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. అదేమంటే ‘మేం నిర్వాహకులకు నోటీసులు ఇస్తున్నాం, వాళ్లు వాటిని లెక్క చేయడం లేదం’టూ అధికారులే చెప్తుండటం గమనార్హం. నోటీసులిస్తూ ఉన్నప్పటికీ నిర్వాహకులు పట్టించుకోక పోతే ఉన్నతాధికారులు కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగులుతోంది. ఐదు నెలల నుంచి కొనసాగుతున్న ఈ తంతు చూస్తే అధికారుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. నిబంధ‌న‌ల గురించి వేలంపాట సమయంలో అంత తీవ్రమైన హెచ్చరికలు చేసిన అధికారులు, ఏమీ చేయకుండా చూస్తున్న తీరు పట్ల పలు అనుమానాలు, ఆరోపణలు రేకెత్తుతూ ఉన్నాయి. మోరంపల్లిబంజర వారపు సంత నిర్వహణలో నిబంధ‌న‌లకు పాతరేస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, నిబంధ‌న‌లు పాటించేలా చూడాలని, బాధ్యులైన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
—-‐-‐——‐———‐——————
నోటీసులిచ్చినా నిర్వాహకులు లెక్క చేయడం లేదు : పంచాయతీ కార్యదర్శి భవాని.
—–‐———-‐–‐——‐—————-
వారానికి రెండురోజుల పాటు మాత్రమే సంత నిర్వహించాల్సి ఉండగా రూల్స్ కు విరుద్ధంగా బుధవారం కూడా నిర్వహిస్తున్న దానిపై నిర్వాహకులకు పలుమార్లు నోటీసులిచ్చామని గ్రామ పంచాయతీ కార్యదర్శి భవాని, ‘దివిటీ మీడియా’కు తెలిపారు. నిర్వాహకులు నోటీసులను లెక్కచేయడం లేదనే విషయం కూడా ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు ఆమె వెల్లడించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెనువిషాదం…

Divitimedia

ఊరచెరువు అభివృద్ధికి తహసిల్దారును కలిసిన రోటరీబృందం

Divitimedia

ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుక

Divitimedia

Leave a Comment