Divitimedia
Bhadradri KothagudemLife StyleNational NewsSpot NewsTelangana

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ జి.వి.పాటిల్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 26)

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతోపాటు పలుచోట్ల మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బందితో ఆయన రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా ప్రజలకు 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్, భారత రాజ్యాంగం విశిష్టత వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, సీపీఓ సంజీవరావు, బీసీ సంక్షేమాధికారి ఇందిర, వివిధశాఖల
అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోనూ ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రపంచంలో అతిపెద్ద లిఖితరాజ్యాంగంగా ప్రపంచ దేశాలలో ఎంతో గుర్తింపు ఉన్న మన రాజ్యాంగం స్పూర్తితో పని చేస్తూ ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యాలుగా ఏర్పడిన పోలీస్ వ్యవస్థలో ఉన్నందున రాజ్యాంగ స్ఫూర్తికనుగుణంగా పనిచేస్తూ, సమాజం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు పోలీసు అధికారులు, సిబ్బంది చేత రాజ్యాంగదినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీలు చంద్రభాను, రెహమాన్, సతీష్ కుమార్, రవీందర్ రెడ్డి, మల్లయ్యస్వామి, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అంగరంగ వైభవంగా గోదావరి నదీహారతి

Divitimedia

ఐటీసీలో కార్మికసంఘం ఎన్నికలు నిర్వహించాలి

Divitimedia

అలెర్ట్… అలెర్ట్… కొత్తగూడెంలో ఆదివారం ట్రాఫిక్ మళ్లింపు

Divitimedia

Leave a Comment