Divitimedia
Bhadradri KothagudemEducationFarmingHyderabadLife StylePoliticsSpot NewsTechnologyTelanganaWELFAREYouth

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూభారతి శిక్షణ కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూభారతి శిక్షణ కార్యక్రమం

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మండలం, డివిజన్, జిల్లా స్థాయిలలో రెవెన్యూశాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు భూ భారతి రిజిస్ట్రేషన్, సక్సెషన్ మాడ్యూళ్లపై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై, భూభారతి చట్టం, నూతన నిబంధనలు, భూరికార్డుల నిర్వహణలో పారదర్శకత, ప్రజలకు వేగవంతమైన సేవలందించడం, ప్రతి దరఖాస్తు చట్టబద్ధంగా పరిశీలించి బాధ్యతాయుతంగా సేవలందించాల్సిన అవసరంపై అధికారులకు విలువైన పలు సూచనలు చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి.వేణుగోపాల్, కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనంత రామకృష్ణ, భూభారతి రిజిస్ట్రేషన్, సక్సెషన్ మాడ్యూళ్ల అమలు విధానం, పత్రాల పరిశీలన, భూ భారతి వ్యవస్థలో అనుసరించాల్సినవిధానాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ (టెక్నికల్ మేనేజర్స్) గా ఎన్.దిలీప్ కుమార్, టి.రాజేష్, ఎస్.సత్యేంద్ర కుమార్ భూభారతి రిజిస్ట్రేషన్, సక్సెషన్ మాడ్యూళ్లను ప్రదర్శిస్తూ, వ్యవస్థలో అనుసరించాల్సిన దశలపై సవివరంగా శిక్షణ అందించారు. ఈ శిక్షణకార్యక్రమం ద్వారా భూ భారతి వ్యవస్థను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు పారదర్శక, వేగవంతమైన, నాణ్యమైన సేవలందించేందుకు అవసరమైన అవగాహన కల్పించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎకరాకు రూ.20లక్షలు, ఒకరికి ఉద్యోగం

Divitimedia

గ్రూప్‌-3 పరీక్షలకు అంతా సిద్ధం : జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్

Divitimedia

భూగర్భజలాల పెంపుదలే లక్ష్యంగా జలశక్తి అభియాన్

Divitimedia

Leave a Comment