Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelanganaWELFARE

కాంట్రాక్ట్ కార్మికుల సేవకుడు వీరన్న ఉద్యోగ విరమణ

కాంట్రాక్ట్ కార్మికుల సేవకుడు వీరన్న ఉద్యోగ విరమణ

హక్కుల సాధన, సేవలో విజయాలకు చిరునామా

ఘనంగా సత్కరించిన యాజమాన్యం, కార్మికులు

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

అందరికీ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు తీరుస్తూ, నాయకత్వమంటే ఇదీ అని నిరూపిస్తూ సాగిన ఉర్లుకొండ వీరన్న ఉద్యోగ, నాయకత్వం ప్రస్థానానికి వీడ్కోలు పలికారు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ప్రముఖమైన ఐటీసీ పేపర్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులకు నాయకుడిగా అందరి నుంచి మన్ననలు పొందిన వీరన్న శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయనను సహచర కార్మికులతోపాటు యాజమాన్యం కూడా ఘనంగా సత్కరించి వీడ్కోలు చెప్పారు. కార్మికులకు యాజమాన్యానికి మధ్య వారధిలా, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఏళ్లపాటు కొనసాగిన ఆయన ఉద్యోగప్రస్థానం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సహచర కార్మికులు హాజరై ఆయన పట్ల తమకున్న ప్రేమాభిమానాలను చాటారు.
ఐటీసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధుల్లో చేరిన వీరన్న, కార్మికుల విశ్వాసం పొంది ఐఎన్‌టీయూసీ కాంట్రాక్ట్ కార్మికుల విభాగం అధ్యక్షుడిగా ఎదిగారు. పదవి రాకముందే కార్మికులకు అండగా నిలిచి సమస్యలు పరిష్కరించేవాడిగా గుర్తింపు పొందిన వీరన్న పదవి చేపట్టిన తర్వాత మరింత బాధ్యతగా పనిచేశారు. తోటి కార్మికుల కష్టాన్ని తన కష్టంగా భావిస్తూ ప్రతిసమస్యలో ముందుండి పోరాడుతూ అందరి మన్ననలు పొందిన వ్యక్తిగా తన ఉద్యోగ, నాయకత్వ ప్రస్థానం పూర్తయిన సందర్భంలో జరిగిన సన్మాన వేడుకలో అందరూ ఆయన సేవలను కొనియాడి సత్కరించారు. కార్మికుడికి అన్యాయం జరిగినా, వేతనాల విషయంలో ఇబ్బంది వచ్చినా, ఏ సందేహమున్నా, ఈఎస్ఐ, పీఎఫ్, సంక్షేమ పథకాలలో సమస్యల పరిష్కారంలో ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. తమ సమస్యల పరిష్కారంలో తమకు మరింత అండగా ఉండాలని కాంట్రాక్ట్ కార్మికులు వీరన్నను ఈ సందర్భంగా కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిరోజు ఎనిమిది మంది నామినేషన్లు

Divitimedia

బూర్గంపాడులో సీపీఎం నాయకుల నిరసన

Divitimedia

మహిళలు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలి : కలెక్టర్

Divitimedia

Leave a Comment