జిల్లాకలెక్టరుతో ఎన్జీఓ ప్రతినిధుల భేటీ..




✍️ దివిటీ మీడియా (మార్కాపురం)
మార్కాపురం జిల్లాకు చెందిన స్వచ్ఛంద సంస్థల(ఎన్జీఓల) ప్రతినిధిబృందం జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత, జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమను తాము పరిచయం చేసుకుని, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలలో ఎన్జీఓలను భాగస్వాములుగా చేయమని కోరారు.
మార్కాపురం జిల్లాగా ఏర్పడిన తర్వాత
మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలలోని అన్ని మండలాలకు సంబంధించిన గ్రామాల్లో చురుకుగా పనిచేస్తున్న ఎన్జీఓలు (నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్) ఈమధ్యనే ఒక ఫోరమ్ గా ఏర్పడినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి తప్పని సరిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎన్జీఓల సేవలను వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్జీఓల ఫోరం అధ్యక్ష, ఉపాధ్యక్షులు చేగిరెడ్డి కోటారెడ్డి, గాయం వెంకటనారాయణరెడ్డి, బి కళావతి ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్, పలువురు ఇతర ఎన్జీఓల ప్రతినిధులు పాల్గొన్నారు.

