నేరాల ఛేదనలో కీలకమైన భాద్యతలు నిర్వర్తించాలి

సీసీఎస్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
✍️ దివిటీ మీడియా (ఖమ్మం)
నేరాల గుర్తింపు, దర్యాప్తు విషయంలో సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) మరింత సమర్థవంతంగా పని చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ (సీపీ) సునీల్ దత్ సూచించారు. మంగళవారం నగరంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ నేరాలు, దొంగతనాలు, దోపిడీలు తదితరాలను గుర్తించడంలో దర్యాప్తు అధికారులకు అందిస్తున్న సహాయం, పాత నేరస్థుల కదలికలకు సంబంధించి ముందస్తు సమాచార సేకరణలో సీసీఎస్ పోలీసుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరాల ఛేదనలో కీలకంగా వ్యవహరించే సీసీఎస్‌ను మరింత పటిష్ఠ పరిచేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రాపర్టీ రికవరీపై సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వివిధ రకాలైన నేరాల అదుపునకు అందుబాటులోని ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకోవడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఉన్న పెండింగ్ కేసులు త్వరగా ముగించాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తు వేగవంతం చేయడానికి క్రైమ్ బృందాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

