Divitimedia
Crime NewsEducationKhammamLife StyleSpot NewsTelanganaYouth

కాలువలోకి దూసుకెళ్లిన శ్రీనిధి స్కూల్ వ్యాన్

కాలువలోకి దూసుకెళ్లిన శ్రీనిధి స్కూల్ వ్యాన్

  • అదృష్టవశాత్తూ తృటిలో తప్పిన పెనుప్రమాదం

✍️ దివిటీ మీడియా (ఖమ్మం)

మధిర మండలంలో మంగళవారం శ్రీనిధి ప్రైవేటు స్కూల్ బస్సు రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. సిరిపురం – వంగవీడు రోడ్డులో జరిగిన ఈ ఘటనతో కలకలం రేగింది. ఆ రోడ్డుపై వెళ్తుండగా స్కూల్ వ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికులు అప్రమత్తమై వ్యానులోని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటనలో భారీ ప్రమాదం తృటిలో తప్పగా, కొందరు విద్యార్థులకు స్వల్పగాయాలైనట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ షర్మిలారెడ్డి ఘాటు విమర్శలు

Divitimedia

సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యానికి మేలు : ట్రైనీ కలెక్టర్ మురళి

Divitimedia

‘రాజీవ్ యువవికాసం’ కార్యక్రమం ప్రారంభించిన సీఎం

Divitimedia

Leave a Comment