Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTelanganaWELFAREYouth

గిరిజన బీఈడీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

గిరిజన బీఈడీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక గిరిజన బీఈడీ కళాశాలలో 2026-28 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంత గిరిజన పట్టభద్రుల నుంచి నేరుగా దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ బీఈడీ కళాశాలలో మొత్తం 100 సీట్లున్నాయని, ఇక్కడ ప్రవేశాలకు తెలంగాణకు చెందిన అభ్యర్థులు ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంతాలకు చెందిన గిరిజన పట్టభద్రులై ఉండాలని వెల్లడించారు. డిగ్రీ పాసై కనీసం 40శాతం మార్కులు సాధించి ఉండాలని, సంబంధిత డిగ్రీ పరీక్షలో సాధించిన మెరిట్ బట్టి ఎంపిక జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మహిళలు, ప్రత్యేక కేటగిరీవారికి సీట్లు రిజర్వుచేయబడ్డాయని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్.14 (తేదీ 12-04-202), నెంబర్.53 (తేదీ 19-05-2009), ప్రకారం పూర్తి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారన్నారు. ప్రవేశ ప్రాస్పెక్టస్, దరఖాస్తులు ఉచితంగా ఇస్తారని, ఏటూరునాగారం, ఉట్నూర్, మన్ననూరు ఐటీడీఏ కార్యాలయంల్లో, భద్రాచలం బీఈడీ కళాశాలలో కూడా ప్రోస్పెక్టస్, దరఖాస్తులు ఉచితంగా పొందవచ్చని పీఓ వెల్లడించారు. ఈ దరఖాస్తు పోస్టు ద్వారా పొందాలనుకునే అభ్యర్థులు తమ సొంత అడ్రస్ గల కవర్(రు.10/-స్టాంపుతో)ను “ప్రిన్సిపాల్, గిరిజన విద్యాకళాశాల, భద్రాచలం”కు పంపి పొందవచ్చన్నారు. ప్రాస్పెక్టస్ లోని క్షుణ్ణంగా చదివి దరఖాస్తుని సక్రమంగా పూర్తిచేసి, ఆగస్టు 16వ తేదీ లోపు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 8247528404, 8247798370, 9912272959 సెల్ ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ‘వెటరన్స్ ర్యాలీ’

Divitimedia

టీటీ బాలబాలికల టీం ఛాంపియన్స్ హైదరాబాద్

Divitimedia

విపత్కర పరిస్థితుల్లో సేవలకు డీడీఆర్ఎఫ్ సిద్ధం : ఎస్పీ

Divitimedia

Leave a Comment