Divitimedia
Crime NewsEducationJudicialKhammamLife StyleSpot NewsWELFAREWomenYouth

విద్యార్థినులకు న్యాయ అవగాహన కార్యక్రమం

విద్యార్థినులకు న్యాయ అవగాహన కార్యక్రమం

✍️ దివిటీ మీడియా (ఖమ్మం)

జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఆ సంస్థ ఖమ్మం కార్యదర్శి పి.దేవిమానస దానవాయిగూడెంలోని టీజీఎస్‌డబ్ల్యుఆర్ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు శుక్రవారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మిషన్ బాల సురక్ష – శిక్షా ప్లాన్–2026, నాల్సా (Child Friendly Legal Services to Children and their Protection Scheme-2015) అమల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె “విద్యా హక్కు– విద్యార్థుల బాధ్యతలు” అనే అంశంపై మాట్లాడుతూ, పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009 గురించి వివరించారు. విద్య ప్రతి చిన్నారి హక్కు అని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవచ్చని తెలిపారు. విద్యకున్న ప్రాముఖ్యత, నిర్బంధ విద్య, మొదటి తరం విద్యార్థులకు ప్రేరణ, తల్లిదండ్రుల పాత్ర, రెసిడెన్షియల్ పాఠశాలల్లో యోగా, విద్యార్థుల బాధ్యతలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పిల్లలకు ఉచిత న్యాయ సహాయం, రక్షణ, వారి హక్కుల పరిరక్షణకు జిల్లా న్యాయ సేవా సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, వార్డెన్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.

జులై 18న ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం

ఖమ్మం జిల్లా న్యాయ సేవాసంస్థ ఆధ్వర్యంలో జూలై 18న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని ఆ సంస్థ కార్యదర్శి పి.దేవిమానస ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌ కార్యక్రమంలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం (Negotiable Instruments Act) కింద పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించేందుకు అవకాశం కల్పించబడుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని, పరస్పర అవగాహనతో కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పి.దేవిమానస సంబంధిత కక్షిదారులను కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తాలిపేరు ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్

Divitimedia

మూడు గంటలు ప్రచారం… మూడు నిమిషాల గ్రామసభ…

Divitimedia

Divitimedia

Leave a Comment