Divitimedia
Bhadradri KothagudemEntertainmentHyderabadInternational NewsLife StyleNational NewsSpot NewsTelanganaTravel And Tourism

శ్రీరామనవమి ఏర్పాట్లపై 6న సమీక్ష సమావేశం

శ్రీరామనవమి ఏర్పాట్లపై 6న సమీక్ష సమావేశం

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 5)

భద్రాచలంలో ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరిగే శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణం, పట్టాభిషేకం వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై గురువారం (మార్చి6 తేదీ) ఉదయం 11గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీసీతారామచంద్ర స్వామి కళ్యాణం, పట్టాభిషేక ఉత్సవం తిలకించడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అన్నిరకాల వసతి సౌకర్యాలు కల్పించడానికి సమగ్ర సమాచారంతో సంబంధిత జిల్లా అధికారులు ఈ సమీక్ష సమావేశానికి తప్పనిసరిగా రావాలని ఆయన కోరారు.

Related posts

గాడి తప్పిన పాలన… అవుతోంది హేళన…

Divitimedia

వాయనాడ్ లో ఏరియల్ సర్వే చేసిన ప్రధాని మోదీ

Divitimedia

రామచంద్రయ్య మృతికి మంత్రి పొంగులేటి సంతాపం

Divitimedia

Leave a Comment