Divitimedia
Andhra PradeshHyderabadLife StyleNational NewsSpecial ArticlesTelanganaTravel And TourismWomen

నేటి నుంచి సీఆర్పీఎఫ్ “యశస్విని”తో క్రాస్ కంట్రీ బైక్ యాత్ర

నేటి నుంచి సీఆర్పీఎఫ్ “యశస్విని”తో క్రాస్ కంట్రీ బైక్ యాత్ర

దేశమంతటా 150మంది మహిళా అధికారుల క్రాస్ కంట్రీ ర్యాలీ

15 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 10వేల కిలోమీటర్ల యాత్ర

✍🏽 దివిటీ మీడియా – న్యూఢిల్లీ

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), దేశంలో మహిళాశక్తిని చాటిచెప్పే లక్ష్యంతో “యశస్విని”పేరుతో మహిళా బైకర్లబృందం క్రాస్ కంట్రీ బైక్ ర్యాలీ (యాత్ర) నిర్వహిస్తోంది. మంగళవారం (3,
అక్టోబర్) సీఆర్పీఎఫ్ కు చెందిన మొత్తం 150మంది మహిళా అధికారులు, మూడు బృందాలుగా క్రాస్ కంట్రీ ర్యాలీ ప్రారంభించ బోతున్నారు.75రాయల్ ఎన్‌ఫీల్డ్(350సీసీ) మోటార్‌బైక్‌లపై ఈ బృందాలు దేశంలోని ఉత్తరప్రాంతం శ్రీనగర్, తూర్పు ప్రాంతంలో షిల్లాంగ్, దక్షిణప్రాంతంలోని కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభిస్తాయి. అక్టోబర్ 31 న ఈ బృందాలు గుజరాత్‌లోని ఏక్తానగర్ (కెవాడియా)లోని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద కలుస్తారు. అక్కడ యాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశంలోని 15 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా దాదాపు 10వీల కిలోమీటర్ల మేర ఈ మహిళా బైక్ ర్యాలీ సాగుతుంది. వారి ప్రయాణాల్లో దారి పొడవునా అనేక జిల్లాల్లో “బేటీ బచావో బేటీ పడావో”లో భాగంగా స్థానికులతో కలిసి పాఠశాలలు, కళాశాలల్లో బాలికలు, మహిళా స్వయం సహాయక బృందాలు, ఎన్సీసీ క్యాడెట్‌లతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం కోసం ప్రణాళిక రూపొందించారు. బాలల సంరక్షణ కేంద్రాలు(సీసీఐలు), నెహ్రూ యువ కేంద్రం సభ్యులు, కౌమారదశలోని బాల,బాలికలు అంగన్‌వాడీ కార్యకర్తలు ‘బేటీ పడావో బేటీ బఛావో’ ఛాంపియన్లతో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. “దేశ్ కే హమ్ హై రక్షక్” అనే తమ ఫోర్స్ సందేశాన్ని ప్రచారం, “బేటీ బచావో బేటీ పడావో” అనే సామాజిక సందేశాన్ని కూడా ఈ మహిళా బైకర్లు తమ ప్రచారంలో చేర్చుకున్నారు. ఈ ప్రచారంలో భాగంగా తమ యూనిఫాంలు, బ్యానర్లపై గర్వంగా ‘బేటీ బచావో బేటీ పడావో’ లోగో ప్రదర్శించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పడితే ప్రాణాలు పోవడం ఖాయం…

Divitimedia

సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యానికి మేలు : ట్రైనీ కలెక్టర్ మురళి

Divitimedia

ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం

Divitimedia

Leave a Comment