Divitimedia
Bhadradri KothagudemCrime NewsHealthLife StyleSpot NewsTechnologyTelanganaWomenYouth

గోదావరి వరద నేపథ్యంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు

గోదావరి వరద నేపథ్యంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు

✍️ భద్రాచలం – దివిటీ (సెప్టెంబరు 3)

భద్రాచలం ప్రాంతంలో గోదావరి వరదలు అంతకంతకు పెరుగుతుండటంతో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యలు తెలియజేయడానికి కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో భారీవర్షాలు, వరదలు- 2024 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన గ్రామాల ప్రజలు వరద ముంపునకు గురయ్యే పరిస్థితుల్లో తమ సమస్యలను ఐటిడిఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన కోరారు. ఇతర గ్రామాల ప్రజలు, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం – 9392919743నెంబరుకు, భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం – 7995268352, సబ్ కలెక్టర్ కార్యాలయం – 08743-232444, వరదల కంట్రోల్ రూమ్ – 7981219425 నెంబర్లకు ఫోన్ చేసి సమస్యలు తెలియజేసి పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తెలంగాణ “భూభార‌తి” చట్టానికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

Divitimedia

శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో “రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్”

Divitimedia

భద్రాద్రి కొత్తగూడెంలో ఈ నెల 7నుంచి జాతీయ కబడ్డీ పోటీలు

Divitimedia

Leave a Comment