Divitimedia
Spot News

పర్యావరణ ఆడిటింగ్ థర్డ్ పార్టీ బృందం తనిఖీ

పర్యావరణ ఆడిటింగ్ థర్డ్ పార్టీ బృందం తనిఖీ

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

భద్రాచలం పయనీర్ అసోసియేషన్ నేతృత్వంలోని జీకేఎఫ్ ఆగ్రో ఫారెస్ట్రీ సంస్థ అమలు చేస్తున్న అతి పెద్ద కార్బన్ క్రెడిట్ ప్రాజెక్ట్ థర్డ్ పార్టీ వాలిడేషన్ ప్రక్రియలో భాగంగా “కార్బన్ చెక్” సంస్థ సోమవారం ఆడిటింగ్ చేశారు. సంస్థ ఆడిటింగ్ బృందం సభ్యులు లలిత్, ప్రశాంత్ కార్బన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్, సంస్థ పని తీరు, జీకేఎఫ్ సంస్థ రైతులతోపాటు వివిధ రైతుసంఘాలతో చేసుకుంటున్న ఒప్పంద పత్రాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీనితో పాటు సందేహాలు అడిగి తెలుసుకున్నారు. సంస్థ పనితీరు, రికార్డుల నిర్వహణ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. సోంపల్లి గ్రామ ప్రజలను కలవడంతోపాటు, స్థానిక రైతులు పండగ రాములు, తాటి లక్ష్మి, తాటి శంకరమ్మ, తదితరుల పొలాలు పరిశీలించారు. ఈ పర్యటనలో ఆడిటింగ్ బృంద సభ్యుడైన లలిత్ తోపాటు సంస్థ అధిపతి పాషా, క్లైమ్ ట్రిక్ సంస్థ ప్రతినిధులు షాహిద్, మృదుల్, తదితరులు పాల్గొన్నారు. సోంపల్లి రైతులు రాములు, రమేష్, వెంకన్న, రామిరెడ్డి ఈ కమిటీ సభ్యులకు తమ పొలాలు చూపించడంతో పాటు తమ సాగు పద్ధతులను సభ్యులకు వివరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లా కలెక్టర్

Divitimedia

తెలంగాణ మంత్రిమండలి కీలక నిర్ణయాలు

Divitimedia

మిగిలిన నాలుగు గ్యారెంటీలు కూడా 100 రోజుల లోపు అమలు చేస్తాం

Divitimedia

Leave a Comment