Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelangana

హరిత భద్రాద్రి సాధనకై గ్రీన్ భద్రాద్రి కృషి అభినందనీయం

హరిత భద్రాద్రి సాధనకై గ్రీన్ భద్రాద్రి కృషి అభినందనీయం

భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

హరిత భద్రాద్రి సాధన లక్ష్యంగా నిరంతరంగా మొక్కలు నాటుతూ, వాటిని సంరక్షిస్తున్న గ్రీన్ భద్రాద్రి భద్రాచలం పట్టణ వాసులందరికి ఆదర్శప్రాయమని, అందరూ భాగస్వాములై పచ్చని భద్రాచలం సాధించు కోవాలని ఏఎస్పీ పరితోష్ పంకజ్ చెప్పారు. స్థానిక శ్రీచైతన్య స్కూల్ ప్రక్కన గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ విషయంలో తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఆ సంస్థకు ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమంలో భద్రాచలం పట్టణ ఎస్సై విజయలక్ష్మి, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షుడు బెల్లంకొండ రాంబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీరంగం సంపత్,
కోశాధికారి విష్ణుమొలకల సుబ్రమణ్యం, గౌరవాధ్యక్షుడు యేగి సూర్యనారాయణ, మాజీ అధ్యక్షుడు గోళ్ల భూపతిరావు, నాగ సూర్యనారాయణ, కె. కృష్ణార్జునరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు భీమవరపు వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు ఆకిశెట్టి ఉమా శంకర్ నాయుడు, పూసం రవికుమారి, న్యాయసలహాదారు పామరాజు తిరుమల రావు, పిఆర్ఓ ఎల్. వెంకటేశ్వరరావు, ఆర్ రామకృష్ణారెడ్డి, చారుగుళ్ల నాగభూషణం, బండారు తిలక్, తంగేటి కృష్ణ, దాట్ల శ్రీనివాసరాజు, జూపల్లి ప్రసాద్, రాజు,
బత్తుల సాంబయ్య, రాణి, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జియోగ్రఫీ విభాగంలో అంబేద్కర్ కు ఓయూ డాక్టరేట్

Divitimedia

లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు

Divitimedia

భార్యపై కోపంతో 8ఏళ్ల కన్నకూతురిని చంపిన కసాయి తండ్రి

Divitimedia

Leave a Comment