Divitimedia
KhammamLife StyleSpot NewsTechnologyTelanganaWELFARE

వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పరిశీలించిన కలెక్టర్

వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పరిశీలించిన కలెక్టర్

✍️ దివిటీ మీడియా (ఖమ్మం)

పేదకుటుంబాలకు గౌరవప్రదమైన వసతి జీవనం అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకుని, సొంతింటి కల సాకారం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కోరారు. ఆయన బుధవారం ఖమ్మం నగరం వెలుగుమట్ల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్మాణ పనులు తనిఖీచేశారు. ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, నిర్మాణ దశల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలపై ఆరా తీసిన కలెక్టర్, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ నిర్మాణదశలో ఉన్న ఇళ్లను ఒక్కొక్కటిగా పురోగతిని పరిశీలించారు. ప్రతి ఇంటినిర్మాణం నాణ్యతప్రమాణాల ప్రకారం ఉండే విధంగా పర్యవేక్షించాలని, లబ్ధిదారులకు సాంకేతిక సూచనలు అందించి నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా సహకరించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ జయచంద్ర, హౌజింగ్ ఈఈ జగ్గారావు, హౌసింగ్ ఏఈలు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, లబ్దిదారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రధాని మోదీకి కువైట్ అత్యున్నత గౌరవం

Divitimedia

రేపు కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి పర్యటన

Divitimedia

సరి ‘హద్దులు దాటుతున్న’ పేదల బియ్యం

Divitimedia

Leave a Comment