Divitimedia
Crime NewsKhammamSpot NewsTelanganaYouth

ప్రమాదంలో మృతిచెందిన పాత్రికేయుడికి మధిర ప్రెస్ క్లబ్ నివాళి

ప్రమాదంలో మృతిచెందిన పాత్రికేయుడికి మధిర ప్రెస్ క్లబ్ నివాళి

✍️ దివిటీ మీడియా (మధిర)

ఖమ్మం జిల్లాలో రావినూతల గ్రామం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బోనకల్లు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన విజన్ ఆంధ్ర రిపోర్టర్ మంద సత్యానందం మృతదేహం వద్ద మధిర ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు. సత్యానందం మృతితో పాత్రికేయులలో తీవ్రవిషాదం నెలకొంది. మంగళవారం మధిర ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆసుపత్రిలో మధిర ప్రెస్ క్లబ్ సభ్యులు సత్యానందం భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యానందం మృతి పాత్రికేయరంగానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో మధిర ప్రెస్ క్లబ్‌ అధ్యక్షుడు జి.వి, ప్రచార కార్యదర్శి అర్జున్, కార్యవర్గ సభ్యులు విజయరాజు, వేణు, జైశీలుడు, కోటి, సంతోష్, నాగరాజు, పలు మీడియాలకు చెందిన పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆర్గానిక్ అటవీ ఉత్పత్తులు అద్భుతం

Divitimedia

మహిళలపై అత్యాచారాలు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం

Divitimedia

నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపై చీటింగ్ కేసులు : డీఎస్పీ రెహమాన్

Divitimedia

Leave a Comment