కలెక్టరును సత్కరించిన న్యాయవాదులు
✍️ దివిటీ – కొత్తగూడెం (నవంబరు 21)
జాతీయస్థాయి అవార్డు అందుకుని, జిల్లాకు అరుదైన గౌరవం తీసుకొచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జతేష్ వి పాటిల్ ను జిల్లాలోని న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. జిల్లాలో జల వనరుల సంరక్షణ కార్యక్రమాన్ని విజయ వంతంగా అమలు చేసినందుకు గాను ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకున్న కలెక్టరును ఈ సందరంభంగా వారంతా అభినందించారు. సౌత్ జోన్ లో ప్రథమ బహుమతితోపాటు రూ.25లక్షల నగదు బహమతి కూడా అందుకోవడం, రాష్ట్రం లోని 33 జిల్లాల నుంచి ఈ అవార్డుకోసం ఎంపిక చేసినవాటిలో భద్రాద్రి కొత్తగూడెం బహుమతి గెలుచుకోవడం పట్ల హర్షం ప్రకటించారు. జల సంరక్షణలో ప్రజల భాగ్యస్వామ్యం పెంచేలా కలెక్టర్ చేసిన కృషికి గుర్తింపుగా జాతీయ పురస్కారం దక్కిందన్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, సత్తుపల్లి, మణుగూరు నుంచి న్యాయవాదులంతా కలిసి కలెక్టరును సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జనపరెడ్డి గోపికృష్ణ, సీనియర్ న్యాయవాదులు గణేష్ బాబు, రేపాక వెంకటరత్నం, రమేష్ కుమార్ మక్కడ్, పలివెల సాంబశివరావు, జియా ఉల్ హుసేన్, ఎర్రపాటి కృష్ణ, నంబూరి రామకృష్ణ, షామీర్ శరత్, రవితేజ మహిళా న్యాయవాదులు జి.శాంత, అన్నపూర్ణ, ఆర్తి మక్కడ్ తదితరులు పాల్గొన్నారు.

