Divitimedia
Crime NewsKhammamSpot NewsTelanganaWomen

ఖమ్మం నగరంలో ఓ ఉన్మాది ఘాతుకం

ఖమ్మం నగరంలో ఓ ఉన్మాది ఘాతుకం

పన్నెండేళ్ల బాలికపై అత్యాచారయత్నం…

భవనంపై నుంచి కిందకు తోసి చంపేందుకు యత్నం

✍️ దివిటీ మీడియా

ఖమ్మం నగరంలో జరిగిన అత్యంత అమానుష ఘటన మనుషులలో దాగి ఉండే రాక్షసత్వానికి పరాకాష్టగా నిలిచి సభ్యసమాజాన్ని వెక్కిరిస్తోంది. కేవలం పన్నెండేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన ఓ మానవమృగం, ఎవరికీ ఆ విషయం తెలియకుండా చేయాలన్న ప్రయత్నంలో ఆ చిన్నారిని భవనంపైన మూడంతస్థుల ఎత్తులో నుంచి కిందకు తోసివేసి చంపే ప్రయత్నం చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మూడు రోజుల క్రితం జరిగినట్లు చెప్తున్న ఈ దారుణంపై బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి… ఈ నెల(జూన్) 6వ తేదీన ఖమ్మంలోని రాపర్తినగర్ ప్రాంతంలో ఓ అపార్టుమెంట్ లో నివాసం ఉండే 57 సంవత్సరాల కారు డ్రైవర్ ఎం.డి.గౌస్ ఒక మైనర్ బాధితురాలి పై అత్యాచార యత్నం చేసి బిల్డింగ్ పై నుంచి కిందకు తోసేసినట్లు బాధితురాలి తండ్రి జూన్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణంపై జూన్ 8వ తేది రాత్రి సదరు బాధితురాలు తండ్రి ఖమ్మం 2 వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు ఇవ్వగా హత్యాయత్నం, పొక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభింఛి బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి, ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల ప్రకారం నిందుతుడు, కారు డ్రైవర్ ఎం.డి.గౌస్ ను మంగళవారం అరెస్ట్ చేశారు. కేసు నమోదైన 24గంటల లోపు నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పర్చినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నందున మిగిలిన వివరాలు పూర్తి దర్యాప్తు అనంతరం తెలియపర్చుతామని పేర్కొన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కఠినచర్యలు తీసుకున్నందున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో బాధితురాలైన బాలిక ఫోటోలను గానీ, పేరు,తదితర వివరాలను గానీ బహిర్గతపర్సుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే, POCSO Act, BNS Act ప్రకారం వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి పోలీసులు హెచ్చరించారు.
చేసిన దురాగతం బయటపడుతుందనే కారణంతో నిందితుడు గౌస్ ఆ బాలికను భవనం పైనుంచి కిందకు తోసేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అపార్ట్మెంట్ కింద ఓ చోట పెద్ద పెద్ద బండలుండగా, చుట్టూ ప్రహారీగోడ కూడా ఉంది. ఆ రెండు ప్రాంతాల్లో ఎక్కడ పడినా బాలిక ప్రాణాలు దక్కేవి కావని, అదృష్గవశాత్తూ ఆమె బతికిందని తెలుస్తోంది.

కాగా ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందించారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ దుర్మార్గుడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. బాధిత బాలిక తండ్రితో ఆయన ధైర్యం చెప్పారు. బాలికను అత్యున్నత వైద్యం అందించడం కోసం తక్షణమే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించిన మంత్రి, ఆమె వైద్య ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. ఆ బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ దురాగతంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

పట్టుబడిన వాహనాల వేలంలో రూ.15లక్షల పైగా ఆదాయం

Divitimedia

కరవైణ రక్షణ… పనిలో పర్యావరణ భక్షణ

Divitimedia

ఎన్నికలు పరిష్కరిస్తున్న వంతెన సమస్య

Divitimedia

Leave a Comment