జల్లావాసికి ఆసియా హాకీ ఫెడరేషన్ గుర్తింపు
ఘనత సాధించిన మొట్టమొదటి గిరిజన యువకుడు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 19)

ఆసియా హాకీ ఫెడరేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన టెక్నికల్ అఫీషియల్ లెవల్ 1 కోర్సును భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఆపాక నిఖిల్ విజయవంతంగా పూర్తిచేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ ఎంపికల్లో పాల్గొని అధ్భుతమైన మెళకువలు ప్రదర్శించి గతంలో సైతం అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ వారి ఆద్వర్యంలో నిర్వహించిన లెవల్ 1 కోచ్ కోర్పును సైతం పూర్తిచేసిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ఈ రెండుకోర్సులు విజయవంతంగా పూర్తిచేసిన మొట్ట మొదటి గిరిజన యువకునిగా ఘనత సాధించారు. స్థానిక కొత్తగూడెం హాకీ క్లబ్ సభ్యునిగా తన హాకీ క్రీడా ప్రస్థానం ప్రారంభించిన నిఖిల్ ఎన్ఐఎస్- 2021 హాకీ క్రీడలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. పలు రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టుకు ఆయన నాయకత్వం వహించారు. ఇటీవల ఆసియా హాకీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు బీహార్ రాష్ట్రం రాజ్ గిరిలో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ – ఆసియా హాకీ ఫెడరేషన్ వారు చేపట్టిన టెక్నికల్ అఫీషియల్ లెవల్ 1 కోర్సును పూర్తి చేశారు. నిఖిల్ ప్రస్థుతం బిల్డింగ్ బ్లాక్స్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంత గొప్ప ఘనతను తమ క్రీడాకారుడు సాధించడం పట్ల భద్రాద్రి హాకీ ఆసోసియేషన్ ఛైర్మన్ పల్లపోతు శ్రీనివాసు, అధ్యక్షుడు ఇమంది ఉదయకుమార్, కార్యదర్శి బట్టు ప్రేమ్ కుమార్. కోచ్ షేక్ ఇమామ్, లగడపాటి రమేష్, సలీంఖాన్, రాజ్ కుమార్, కృష్ణవేణి, మంజుల, కవిత, సాగరాజు. సలీం తదితరులు అభినందించారు.
*
నిఖిల్ సాధించిన విజయాలు….
*
- 2021 సంవత్సరం బెంగళూరులో ఎన్ఐఎస్ హాకీ ఏడాది కోర్సును పూర్తి చేశారు.
- 2022లో పంజాబ్ రాష్ట్రం పాటియాలలో నిర్వహించిన హాకీ ఇండియా లెవల్ 1 కోచ్ కోర్సును పూర్తి చేశారు.
- 2023లో కాకినాడలో నిర్వహించిన దక్షణ భారత లెవల్ 1 కోర్సును పూర్తి చేశారు.
- 2024లో పాటియాలలోనే నిర్వహించిన హాకి ఇండియా లెవల్ 2 కోచ్ కోర్సును పైతం పూర్తి చేశారు.
- 2024 కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన లెవల్ 1 టెక్నికల్ ఆఫీషియల్ కోర్సును వూర్తి చేశారు.
- 2024లో తాజాగా బీహర్ రాష్ట్రం రాజ్ గిరిలో నిర్వహించిన లెవల్ 2 టెక్నికల్ ఆఫీషియల్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి ఆ ఘనత సాధించిన మొట్టమొదటి గిరిజన యువకుడిగా నిలిచారు.