Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsSpot NewsTelanganaWomenYouth

పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితాలు ఖరారు

పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితాలు ఖరారు

వివరాలు ప్రకటించిన భద్రాద్రి కొత్తగూడెం డీపీఓ

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 13)

గ్రామ పంచాయతీలకు సాధారణ ఎన్నికలు- 2024 నిర్వహణకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కొత్తగూడెం మైనహా 22 మండలాలు, 479 గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాల్లో ఓటర్ల సంఖ్య వివరాలను జిల్లా పంచాయతీ అధికారి శుక్రవారం ప్రకటించారు. ఆ జాబితా ప్రకారం జిల్లాలో 484 గ్రామపంచాయతీలుండగా, 5 పంచాయతీలను భద్రాచలం, సారపాక గ్రామ పంచాయతీల్లో తిరిగి విలీనం చేసే ప్రక్రియ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వద్ద పెండింగ్ ఉండటంతో ప్రకటనలో మినహాయించారు. జిల్లాలో గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ప్రచురణ కోసం పరిగణనలోకి తీసుకున్న 479 గ్రామ పంచాయతీల్లో మొత్తం 6,82,858 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 3,31,940 మంది, మహిళలు 3,49,893 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. జిల్లాలో మండలాలవారీగా ప్రకటించిన గ్రామ పంచాయతీ ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి…

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి

Divitimedia

బూర్గంపాడు పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ

Divitimedia

అధికారిక దోపిడీపై చర్యలు లేవా?

Divitimedia

Leave a Comment