‘గిరిజన దర్బార్’కు హాజరుకండి : ఐటీడీఏ పీఓ
✍️ దివిటీ – భద్రాచలం (నవంబర్ 23)
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10.30గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

