Divitimedia
Bhadradri KothagudemLife StyleNational NewsPoliticsSpot NewsTelanganaTravel And Tourism

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణలు

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణలు

కలెక్టరేట్లో పతాకావిష్కరణ చేసిన మంత్రి తుమ్మల

✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 17

తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణగౌడ్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఎస్పీ రోహిత్ రాజు జాతీయజెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) నరేందర్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కార్యాలయ ఏఓ మంజ్యా నాయక్, పలువురు పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నవంబరు 10న ఉమ్మడి జిల్లా పాఠశాలల బాక్సింగ్, సాఫ్ట్ బాల్ ఎంపికలు

Divitimedia

ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్

Divitimedia

ఎన్నికల ప్రక్రియపై సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓ

Divitimedia

Leave a Comment