Divitimedia
Crime NewsHyderabadLife StyleSpot NewsTechnologyTelanganaYouth

అంబర్‌పేట్ ఎస్సై భానుప్రకాష్ రెడ్డి అరెస్ట్

అంబర్‌పేట్ ఎస్సై భానుప్రకాష్ రెడ్డి అరెస్ట్


✍️ దివిటీ మీడియా

బెట్టింగ్ యాప్ అప్పులు తీర్చేందుకు రికవరీ సొమ్ము కాజేసి తాకట్టు పెట్టిన కేసులో అంబర్ పేట్ ఎస్సై భానుప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్టుచేశారు. అంబర్‌ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ, బెట్టింగ్ యాప్‌లకు బానిసై, భానుప్రకాష్ రెడ్డి కేసులలో రికవరీ చేసిన బంగారం తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం గత ఏడాది నవంబర్ నెలలో వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఆ విచారణలో నేరాన్ని అంగీకరించి, తన సర్వీస్ రివాల్వర్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో పోయిందని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. తన సర్వీస్ రివాల్వర్ పోయిందని చెప్పడంతో, దీని గురించి అధికారులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
తనకు ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్–2 ఉద్యోగం వచ్చిందని, అక్కడికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన దరఖాస్తు చేశారు.
ఈ కేసులో సేకరించిన ఆధారాల మేరకు భానుప్రకాష్ రెడ్డిని అరెస్టుచేసిన పోలీస్ అధికారులు, ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సమస్యల పరిష్కారమే ప్రజాపాలన – ప్రగతి లక్ష్యం

Divitimedia

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

Divitimedia

ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును జాబితాలో పరిశీలించుకోవాలి

Divitimedia

Leave a Comment