మల్లన్న ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ ఆవిర్భావం
✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 17
నిత్య రాజకీయ సందడికి వేదికగా మారిన తెలంగాణాలో తాజాగా మరో రాజకీయపార్టీ ఆవిర్భవించింది. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)’ పేరుతో తమ రాజకీయపార్టీని ఏర్పాటుచేసినట్లు ప్రకటించిన ఆయన పార్టీ జెండాను కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాదులో ‘హోటల్ తాజ్ కృష్ణ’ వేదిక కావడం గమనార్హం. తాజ్ కృష్ణ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్లన్న మాట్లాడుతూ, తెలంగాణాలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీలకు ప్రత్యేకంగా ఓ రాజకీయ పార్టీ ఉండాలన్న ఆవశ్యకత గుర్తించి పార్టీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా గతంలో తరచూ ఓసీలపై అందులోనూ ‘రెడ్డి సామాజికవర్గం’ పై తీవ్రస్థాయిలో దూషణలు, ఆరోపణలు, విమర్శలతో మల్లన్న రెచ్చిపోయారు. అభ్యంతరకర వ్యవహారశైలితో నిరసనలు ఎదుర్కొని, విమర్శలపాలైన నేపథ్యంలో మల్లన్న రాజకీయ పార్టీకి ఎలాంటి ఆదరణ లభిస్తుందోననే ఆసక్తి నెలకొంది.
Save or share this story as a newspaper-style Epaper Clip:

