Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamLife StyleMahabubabadSpot NewsTechnologyTelangana

సీతారామ లిఫ్ట్ పంపుహౌస్ పరిశీలించిన జిల్లాకలెక్టర్

సీతారామ లిఫ్ట్ పంపుహౌస్ పరిశీలించిన జిల్లాకలెక్టర్

✍️ అశ్వాపురం – దివిటీ (జూన్ 28)

అశ్వాపురం మండలంలోని బీజీకొత్తూరు సమీపంలోని సీతారామ ఎత్తిపోతల పధకం పంపుహౌస్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆయనకు మ్యాప్ ద్వారా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ పంపు హౌస్ ద్వారా 1500 క్యూసెక్కుల నీరు వస్తుందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 4 పంపుల ద్వారా 104 కిలోమీటర్లు నీరు పంపేందుకు ప్రధాన కాలువ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆగస్టునెలలో నీరు విడుదల చేసేందుకు పనులన్నీ పూర్తిచెయ్యాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కాలువ ఏన్కూరు వద్ద నాగార్జునసాగర్ కాలువకు అనుసంధానం చేయబడుతుందని, తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.20లక్షల ఎకరాలకు మొదటి విడతగా నీటిలభ్యత కల్పించబడుతుందని తెలిపారు. ఈ విధంగా రాబోయే మూడు సంవత్సరాల్లో విడతల వారీగా సీతారామ ఎత్తిపోతలపథకం పూర్తిచేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు నీరందించబడుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, సూపరిండెంట్ ఇంజనీర్లు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వాహకఇంజినీర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించిన కేంద్రం

Divitimedia

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

Divitimedia

ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత

Divitimedia

Leave a Comment