Divitimedia
Bhadradri KothagudemEducationHealthHyderabadLife StyleSportsTechnologyTelanganaYouth

ఉల్వనూరు హెచ్ఎంపై మండిపడిన ఐటీడీఏ పీఓ

ఉల్వనూరు హెచ్ఎంపై మండిపడిన ఐటీడీఏ పీఓ

కిన్నెరసానిలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం

జాతీయస్థాయిలో రాణించాలని క్రీడాకారులకు ఉద్భోధ

✍️ దివిటీ మీడియా – పాల్వంచ (మే 16)

పాల్వంచ మండలం ఉల్వనూరులోని బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం తనిఖీచేసి తరగతి గదులను, డార్మెటరీ, వాష్ రూమ్, టాయిలెట్లను పరిశీలించిన భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, అపరిశుభ్రత పట్ల హెచ్ఎం పద్మావతిపై మండిపడ్డారు. అన్ని పనులను సోమవారం వరకు పూర్తి చేయాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతిగదులకు ఆల్ఫాబెట్స్ ప్రకారం నంబర్లు వేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన పీఓ, పనితీరు మార్చుకోవాలని, బాధ్యతగా పనులు చేయాలని సంబంధిత స్పెషల్ ఆఫీసర్ ను మందలించారు. సోమవారం నాటికి డ్రైనేజీ పనులు, పాఠశాలలో క్లీన్ అండ్ గ్రీన్ చేయించాలని, పిల్లలందరికీ సరిపడా మంచాలు కెన్నెరసాని పాఠశాల నుంచి తెప్పించుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత పాల్వంచ లోని బాలుర ఆశ్రమ పాఠశాల వసతిగృహాన్ని ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ తనిఖీ చేశారు. అన్ని తరగతి గదులలో విద్యార్థులకు లకు సరిపడా ఫ్యాన్లు అమర్చాలని, పాఠశాల ఆవరణలో పిల్లలు ఆడుకునే ఆటస్థలం దగ్గర షెడ్డు నిర్మాణం చేపట్టాలని, పాడైపోయిన టాయిలెట్లు, వాష్ రూములను పూర్తిస్థాయిలో రిపేర్ చేయించాలని, పగుళ్లు ఉన్నచోట ప్యాచ్ వర్క్ చేయాలని, డ్రైనేజీలలో నీరు నిలువ ఉండకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) మణెమ్మ, ఉల్వనూరు హెచ్ఎం పద్మావతి, డిప్యూటీ వార్డెన్ వెంకన్న, పాల్వంచ హెచ్ఎం బుచ్చిబాబు డీఈ మధుకర్, ఏఈ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

*********

సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఐటీడీఏ పీఓ

జాతీయస్థాయిలో రాణించాలని క్రీడాకారులకు ఉద్భోధ

————————————

పాల్వంచ మండలం కిన్నెరసానిలోని క్రీడా పాఠశాలలో గేమ్స్, స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను ఐటీడీఏ పీఓ.ప్రతీక్ జైన్ గురువారం ప్రారంభించారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్రీడాశిక్షణ శిబిరాలను డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మతో కలిసి ఆర్చరీక్రీడతో ప్రారంభించారు. వివిధ క్రీడాంశాల్లో 60 మంది బాలురు, 60 మంది బాలికలు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులనుద్దేశించి మాట్లాడిన ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ మణెమ్మ, క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పాల్గొని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐటీడీఏ క్రీడల అధికారి బొల్లి గోపాలరావు, ఏఎస్ఓ కొమరం వెంకటనారాయణ (క్యాంపు ఇంచార్జి), ఏఎస్ఓలు నాగేశ్వరావు, భద్రాచలం క్రీడా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చందు, క్రీడా శిక్షకులు (కోచ్ లు) తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

చండ్రుగొండ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

నర్సరీ ఆధునీకరణ ప్రణాళికలకు ఐటీడీఏ పీఓ ఆదేశాలు

Divitimedia

భారీవర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :

Divitimedia

Leave a Comment