Divitimedia
EntertainmentInternational NewsLife StyleNational NewsSportsYouth

క్రికెట్ ప్రపంచమంతా ‘విరాట్’స్వరూపం…

క్రికెట్ ప్రపంచమంతా ‘విరాట్’స్వరూపం…

అత్యధిక సెంచరీలలో ప్రపంచ నెంబర్ 1 స్థానంలో విరాట్ కోహ్లీ

అభిమానులకు కోహ్లీ పుట్టినరోజు కానుకగా అజేయ సెంచరీ

✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం

ప్రపంచ క్రికెట్ చరిత్రలో పరుగులయంత్రంగా పేరున్న భారత ఆటగాడు విరాట్ కోహ్లీ తన పుట్టినరోజు సందర్భంగా దక్షిణాఫ్రికా జట్టుపై సెంచరీ(101పరుగులు/121బంతులు)చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కోల్ కతాలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 243 పరుగుల భారీ ఆధిక్యంతో వరుసగా ఎనిమిదో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లోనే ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (49సెంచరీలు) చేసిన భారత క్రికెట్ విశ్రాంత ఆటగాడు సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌లో చేసిన 49 సెంచరీల ప్రపంచ రికార్డును కింగ్ విరాట్ కోహ్లీ కేవలం 289 మ్యాచ్‌లలో ఆడిన 277 ఇన్నింగ్స్‌లోనే సమం చేశాడు. మొత్తం వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపితే వైట్ బాల్ క్రికెట్లో 50సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో విరాట్ 13525 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ, టెస్టుల్లో 8676, టీ20 ఫార్మాట్ లో 4008 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ప్రపంచ కప్-2023లో అత్యధికంగా 550 పరుగులు సాధించిన దక్షిణాఫ్రికా ఆటగాడు డికాక్ కు 543పరుగులతో కేవలం 7పరుగుల దూరం లో (సెకండ్ ప్లేస్) నిలిచాడు. పుట్టినరోజు శుభాకాంక్షలతో… ఆల్ ది బెస్ట్ డియర్ కింగ్ విరాట్ కోహ్లీ…

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

శ్రమశక్తి అవార్డు అందుకున్న ఐటీసీ కార్మిక నాయకుడు రామారావు

Divitimedia

మున్సిపాలిటీ కార్మికులకు కుక్కర్లు వితరణ

Divitimedia

‘ఐసీడీఎస్’లో విచారణ బుట్టదాఖలేనా… ?

Divitimedia

Leave a Comment