రోడ్డు భద్రతే లక్ష్యంగా వాహన తనిఖీలు ముమ్మరం





✍️ దివిటీ మీడియా (ప్రకాశం)
ప్రకాశంజిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజా భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నేరాల నియంత్రణ, రోడ్డుప్రమాదాల నివారణకు ప్రకాశం జిల్లా పోలీసులు శనివారం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా వాహనాలధ్రువపత్రాలతోపాటు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్, తదితర భద్రతా నిబంధనలను పోలీసు సిబ్బంది పరిశీలించారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని వాహనదారులకు సూచించారు. ప్రజల భద్రతకోసం ప్రకాశం జిల్లాలో వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
#PrakasamPolice #VehicleChecking #RoadSafety #TrafficRules #SafeDrive #DriveSafe #TrafficPolice #RoadSafetyAwareness #PrakasamDistrict #PoliceChecking
Save or share this story as a newspaper-style Epaper Clip:

