ఈ నెల 10న ‘జైల్ భరో’ జయప్రదం చేయండి
✍️ దివిటీ మీడియా (పినపాక)
కార్మిక, రైతు వ్యతిరేక విధానాలతో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ‘క్విట్ ఇండియా’ స్పూర్తితో ఈ నెల 10న నిర్వహిస్తున్న ‘జైల్ భరో’ కార్యక్రమం జయప్రదం చేయాలని సీఐటీయు రాష్ట్రనాయకులు ఎ.జె.రమేష్, అన్నవరపు కనకయ్య పిలునిచ్చారు. శనివారం సారపాకలోని సీఐటీయు కార్యాలయంలో జరిగిన సీఐటీయు వ్యవసాయ కార్మిక సంఘం బూర్గంపాడు మండల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు అండగా లేకుండా యాజమాన్యాలకుండే విధంగా 29కార్మిక చట్టాలను మార్చి కార్మికుల్ని బలి పశువులుగా చేస్తోందని విమర్శించారు. ఎందరో చేసిన త్యాగాలతో తెచ్చుకున్న 8 గంటల పని విధానాన్ని12 గంటలకు మార్చిన మోడీ చర్యలు కార్మికులపై ప్రమాదంగా మారుతున్నాయన్నారు.
2025లో విత్తనచట్టానికి ప్రతిపాదించిన సవరణలు రైతుల్ని దివాలా తీయించేలా ఉన్నాయన్నారు. పంటలకు గిట్టుబాటు రేటు లేకుండా నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని బానిసలుగా చేసే విధంగా మోడీ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరోసారి మోడీ ప్రభుత్వంపై ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె.అబీద, వ్యకస జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, సీఐటీయు నాయకులు కనకం వెంకటేశ్వర్లు, ఎస్.కె.పాషా, బత్తుల గోపాలరావు, ఆదూరి నరసింహారావు, ధర్మ, కన్నయ్య, మర్రి వెంకటరెడ్డి, సుధాకర్, శివ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

