Divitimedia
Bhadradri KothagudemCrime NewsSpot NewsTelangana

ఎట్టకేలకు రంగంలోకి దిగిన మండల అధికారులు

ఎట్టకేలకు రంగంలోకి దిగిన మండల అధికారులు

ఇసుక అక్రమ రవాణా నిరోధానికి ట్రెంచులు

✍️ దివిటీ – బూర్గంపాడు (నవంబరు 21)

బూర్గంపాడు మండలంలో యధేచ్ఛగా సాగిపోతున్న ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఎట్టకేలకు మండల అధికారులు స్వయంగా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఈ మేరకు మండల తహసీల్దార్ ప్రసాద్, ఎస్సై మేడా ప్రసాద్, అదనపు ఎస్సై నాగభిక్షం పర్యవేక్షణలో ఇసుక అక్రమ రవాణాకు వినియోగించే మార్గాల్లో ట్రెంచులు తీయిస్తున్నారు. ఈ ట్రెంచుల ద్వారా ఇసుక అక్రమ రవాణా వాహనాల రాకపోకలు నిరోధించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం ఈ మేరకు మండల అధికారులు బృందంగా సారపాక, గొమ్మూరు ప్రాంతాల్లో ట్రెంచెస్ తీయించారు. ఆయా ప్రాంతాల్లో అక్రమ రవాణా చేస్తున్న వాహనాలకు దారులు లేకుండా చేస్తున్నారు. ఈ మండలంలో గోదావరి, కిన్నెరసాని నదులలో భారీగా అందుబాటులో ఉన్న ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇసుక అక్రమ రవాణాలో కొంతమంది అధికారులే సూత్రధారులై, సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మండల అధికారుల బృందం చేపట్టిన నిరోధక చర్యలు ప్రజల నుంచి ప్రశంసలందుకుంటున్నాయి. మండలం పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు కేంద్ర బింధువులుగా మారిన సారపాక, పాత గొమ్మూరులలో ట్రెంచులు తీయించిన అధికారులు మిగిలిన ప్రాంతాల్లో కూడా తీయిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ట్రెంచెస్ తీయించిన ప్రాంతాలతోపాటు మండలం పరిధిలో బూర్గంపాడు, తాళ్లగొమ్మూరు, పినపాకపట్టీనగర్, బుడ్డగూడెం, పాత పినపాక, సోంపల్లి, ఉప్పుసాక, తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. ఆయాప్రాంతాల్లో కూడా ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకుంటారా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మండల అధికారులు ఏవిధంగా చర్యలు తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

▶ అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Divitimedia

నకిరిపేట పంచాయతీలో 100 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక

Divitimedia

ఆషామాషీగా లక్షల రూపాయల ఇసుక వేలం

Divitimedia

Leave a Comment