Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleSpecial ArticlesTelangana

రూ.2.5కోట్ల ప్రజాధనం ‘శిథిలమవుతోంది’…

(ఈ కథనం దివిటీ మీడియా ప్రత్యేకం. దయచేసి కాపీ కొట్టకండి.)

రూ.2.5కోట్ల ప్రజాధనం ‘శిథిలమవుతోంది’…

మూడొంతులు పూర్తయిన ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల దుస్థితి

నకిరిపేట వద్ద ‘బూత్ బంగళాలు’…

✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 21

ఇక్కడ రూ.2.5 కోట్లకు పైగా ‘విలువైన ప్రజాధనం’ శిథిలమైపోతోంది… ఓ యాభై కుటుంబాలకు సౌకర్యవంతమైన జీవనం అందించే లక్ష్యంతో చేపట్టిన నిర్మాణాలు నిరుపయోగంగా మారిపోయాయి… ఓ చిన్న గ్రామంగా మనుషులతో ‘కళకళ’గా ఉండాల్సిన ఆ నిర్మాణాలు ప్రస్తుతం ‘బూత్ బంగళాల’ను తలపిస్తున్నాయి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని నకిరిపేట గ్రామం వద్ద నిర్మాణం తుదిదశలో నిలిచిపోయిన ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల వద్ద పరిస్థితులివి. ఇక్కడ దాదాపు మూడేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన 50 ఇళ్లకు పైగా నిర్మాణాలతో కూడిన ఈ కాలనీలో ఇళ్లన్నీ దాదాపుగా తుదిదశకు చేరాయి. ఈలోగా ప్రభుత్వం మారడంతో డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితి అయోమయంలో పడింది. ఒకటి రెండూ కాదు ఏకంగా 50 ఇళ్లు ‘ఫినిషింగ్’ పనులు చేయకుండా, ఆ కాలనీలో ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిలిచిపోయాయి. దీంతో ఈ ఇళ్లన్నీ కనీస నిర్వహణ కూడా కరవై శిథిలమైపోతున్నాయి. ఈ డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన ‘బిల్లులు’ కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఓ రాజకీయ పార్టీ నుంచి మరో రాజకీయ పార్టీకి పాలన మారినప్పటికీ, విలువైన ప్రజాధనం వృథా అవుతున్న తీరు మాత్రం ఆక్షేపణీయమైన విషయం. గత ప్రభుత్వ పథకమనే కారణంతో ఆ పథకాన్ని నిలిపివేసినప్పటికీ అంతకు ముందు మంజూరు చేసిన నిధులు ఏ మాత్రం వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. పార్టీ రాజకీయం వేరు, ప్రభుత్వ పరిపాలన వేరనేది గుర్తుంచుకుని ప్రజాధనం వృథా కాకుండా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ రూ.2.5కోట్ల వృథా ఒక్కటే కాకుండా ఆ ఇళ్లు పూర్తిచేస్తే ఓ 50 కుటుంబాలకు గూడు కల్పించినవారవుతారనేది నేటి ప్రభుత్వం, పాలకులు గుర్తించాల్సిన సత్యం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఇళ్లను పూర్తిచేసి, అర్హులైన పేదలకు కేటాయించి సద్వినియోగం చేయాలని, ప్రజాధనం వృథా కాకుండా చూడాలని పలువురు సామాజికవేత్తలు సూచిస్తున్నారు.

Related posts

సామగ్రి వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి : ఐటీడీఏ పీఓ

Divitimedia

గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Divitimedia

రేషన్ డీలర్ నుంచి లంచం తీసుకుంటూ…

Divitimedia

Leave a Comment