Divitimedia
Crime NewsHyderabadLife StyleNational NewsSpot NewsTechnologyTelanganaWomenYouth

సరూర్ నగర్ హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

సరూర్ నగర్ హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

✍️ రంగారెడ్డి – దివిటీ (మార్చి 26)

సరూర్ నగర్ లో అప్సర అనే యువతి హత్యకేసులో నిందితుడికి రంగారెడ్డి కోర్టు జీవితఖైదు విధించింది. హత్యతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించాడని మరో ఏడేళ్ల శిక్ష విధించింది. 2023లో తీవ్ర సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో తాజా పరిణామాలివి… వివాహేతర సంబంధం నేపధ్యంలో తనను పెళ్ళి చేసుకోమని అస్పర తరచూ అడుగుతుండటంతో, ఆ యువతిని కారులో శంషాబాద్ తీసుకెళ్లి పూజారి సాయికృష్ణ దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఆమెన హత్య చేసిన సాయికృష్ణ శవాన్ని తన ఇంటి సమీపంలో డ్రైనేజిలో పూడ్చి పెట్టినట్లు గుర్తించారు. హత్య విషయం ఎవరూ గుర్తించకూడదని, మ్యాన్​హోల్​ను మట్టితో నింపి, ఆ తర్వాత సిమెంట్​తో మూసివేశాడు. ఈ కేసు దర్యాప్తు చేసి సరూర్ నగర్ పోలీసులు, సాక్ష్యాలు కోర్టు వారికి సమర్పించడంతో విచారణ జరిపి నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది. సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు మరో ఏడేళ్లజైలు శిక్ష విధించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్, అతిథిగృహం ప్రారంభించిన జిల్లా ఎస్పీ డా.వినీత్

Divitimedia

అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Divitimedia

జీఎస్టీ ఎగవేతలపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి

Divitimedia

Leave a Comment