జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్షలు
తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 17)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రూప్ -3 పరీక్షలు మొదటి రోజైన ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలు జరిగే కేంద్రాలను జిల్లా కలెక్టర్ జిల్లాల.వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఇతర సీనియర్ అధికారులు తనిఖీలు చేశారు. కొత్తగూడెం ఎస్సార్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, సింగరేణి మహిళా డిగ్రీ కాలేజ్, సుజాతనగర్ మండలంలోని వేపులగడ్డ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కాలేజి, పాల్వంచలో కేటీపీఎస్ ఇంటర్మీడియట్ కాలనీలో డీఏవీ మోడల్ స్కూల్లో పరీక్ష కేంద్రాలను జిల్లాకలెక్టర్ పరిశీలించారు. అధికారులతో అభ్యర్థుల హాజరుశాతం గురించి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్ష సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వక పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పరీక్ష కేంద్రాల లోనికి అనుమతించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోనికి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు అరగంట ముందుగానే రావాలనే నిబంధనను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సూచించారు. రుద్రంపూర్ సెయింట్ జోసెఫ్ పాఠశాల్లో గ్రూప్-3 పరీక్షసరళని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు, అక్కడ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ -3 పరీక్షల కేంద్రాల వద్ద పెద్దసంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.