ఎట్టకేలకు గోతులు పూడ్పించిన అధికారులు
‘దివిటీ మీడియా’ కథనంతో కాస్త కదలిక …!
✍️ బూర్గంపాడు – దివిటీ (జులై 5)
బూర్గంపాడు మండలం ముసలిమడుగు గ్రామం వద్ద బ్రిడ్జిపై ప్రమాదకరంగా ఏర్పడిన గోతులను శుక్రవారం నేషనల్ హైవే అధికారులు పూడ్పించారు. ఆ బ్రిడ్జి మీద ప్రమాదాలకు దారితీస్తున్న గోతులు, నేషనల్ హైవేలో నిర్వహణ లోపాల గురించి బుధవారం ‘దివిటీ మీడియా’లో ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ కథనం వల్ల సమస్య ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారి ఆదేశాల మేరకు నేషనల్ హైవేస్ స్థానిక అధికారులలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. దీంతో ముసలిమడుగు గ్రామం వద్ద బ్రిడ్జిపై గోతులను కంకర, తారు, తదితర సామగ్రితో పూడ్పించారు. అత్యంత ప్రమాదకరమైన ఆ గోతులు పూడ్చడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మత్తులు చేస్తుండటం గమనించిన కొందరు ప్రయాణికులు, సమస్య పరిష్కారమయ్యేలా ‘దివిటీ మీడియా’ కృషిని అభినందించారు. జిల్లాలోని ఇతర ప్రదేశాల్లో కూడా లోపాలు సవరించేంతవరకు దివిటీ మీడియా ప్రయత్నం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం… జిల్లాలో నేషనల్ హైవేలోని లోపాలు, సమస్యలపై ‘దివిటీ మీడియా’ ప్రచురించిన కథనం ‘లింక్’ ఇది….👇