Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTelanganaYouth

లొంగిపోయిన 14మంది మావోయిస్టు సభ్యులు

లొంగిపోయిన 14మంది మావోయిస్టు సభ్యులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 3)

నిషేధిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు సోమవారం (మార్చి 3వ తేదీ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ వివరాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఆ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 81, 141 బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పాటు ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుని లొంగిపోయినట్లు ప్రకటించారు. ఇకపై తాము కూడా కుటుంబసభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకుని 14 మంది మావోయిస్టు సభ్యులు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు వివరించారు.
లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరాలిలా ఉన్నాయి…

  1. మడివి భీమా S/O. దేవా ఎర్రపల్లి RPC మిలీషియా కమాండర్, 37 yrs, R/o. మంగలతోరు గ్రామం, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా,
  2. సోడి ఉంగా, 35 yrs, S/o. సోమ్మరు ఎర్రపల్లి RPC CNM అధ్యకుడు, R/o. మంగలతోరు గ్రామం. పామేడ్ PS. బీజాపూర్ జిల్లా.
  3. మడివి అడుమ S/O ఇడుమ – ఎర్రపల్లి RPC CNM అధ్యకుడు, 31 yrs, R/o. మంగలతోరు గ్రామం, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా,
  4. కుంజాం కోసా S/O పొడియా ఎర్రపల్లి RPC DAKM సభ్యుడు, 25 yrs. R/o. మంగలతోరు గ్రామం. పామేడ్ PS. బీజాపూర్ జిల్లా,
  5. కోవాసి నంద @ శ్రీను – కిస్టారం ఏరియా CNM కమాండర్
  6. మడివి భీమా S/O ఇడుమ ఎర్రపల్లి RPC CNM సభ్యుడు, 24 yrs, R/o. మంగలతోరు గ్రామం. పామేడ్ PS. బీజాపూర్ జిల్లా.
  7. మడివి మాసా – CNM పూజారి కంకేర్ RPC, R/o. చిన్న అవుటపల్లి
  8. కుంజాం లక్మా S/O. జోగల్ – టైలరింగ్ టీం కమాండర్, దక్షిణ బస్తర్ డివిజన్, 30 yrs. R/o. దొడ్డి తుమ్నర్ గ్రామం. బీజాపూర్.
  9. పెట్టి లక్కే, D/o. ముయా – పూజారి కంకేర్ RPC CNM సభ్యురాలు, 16 yrs, R/o. కస్తూరిపాడు గ్రామం. ఊసుర్ PS. బీజాపూర్ జిల్లా.
  10. మడవి చుక్కయ్య, S/o. దేవా పూజారి కంకేర్ RPC మిలీషియా క్యాడర్, 40 yrs, R/o. కస్తూరిపాడు గ్రామం, ఊసుర్ PS. బీజాపూర్ జిల్లా.
  11. వెట్టి కోసా, S/o. మాసా – పూజారి కంకేర్ RPC CNM సభ్యుడు, 16yrs, R/o. కస్తూరిపాడు గ్రామం. ఊసుర్ PS, బీజాపూర్ జిల్లా.
  12. మడవి భీమా @రంగ, S/o. దేవా పూజారి కంకేర్ RPC CNM సభ్యుడు, 25 yrs. R/o. కస్తూరిపాడు గ్రామం. ఊసుర్ PS. బీజాపూర్ జిల్లా.
  13. సోడి రాధికా @ పాలే, D/o. అయిత- పూజారి కంకేర్ RPC మిలీషియా సభ్యురాలు, 18yrs, R/o. కస్తూరిపాడు గ్రామం. ఊసుర్ PS, బీజాపూర్ జిల్లా.
  14. కుహ్రామి కాజల్ @ పాలే, D/O చిన్ను పూజారి కంకేర్ RPC CNM సభ్యురాలు, 18yrs, R/o. కస్తూరిపాడు గ్రామం, ఊసుర్ PS, బీజాపూర్ జిల్లా.

గత కొంతకాలంగా CPI మావోయిస్ట్ పార్టీ ఆదివాసీ ప్రజల్లో ఆదరణ, నమ్మకం కోల్పోయి కాలం చెల్లిన సిద్ధాంతాలతో పాటు, బలవంతపు వసూల్లే లక్ష్యంగా పనిచేస్తూ, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి అమాయకపు ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విషయాలను గ్రహించి, ఈ మావోయిస్ట్ సభ్యులు పార్టీని వీడి లొంగిపోయారని వివరించారు. గడిచిన రెండు నెలల కాలంలో 44మంది మావోయిస్టు సభ్యులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ రోహిత్ రాజ్ ఈ సందర్భంగా వెల్లడించారు. లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే పార్టీ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గానీ, స్వయంగా గానీ తమ దగ్గరలో గల పోలీస్ స్టేషన్, జిల్లా ఉన్నతాధికారుల వద్ద గానీ సంప్రదించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన దళ సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరపున అందవలసిన అన్నిరకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Divitimedia

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద పేదల దీక్షలు

Divitimedia

అమరారం గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే సమీక్ష

Divitimedia

Leave a Comment