Divitimedia
Bhadradri KothagudemDELHIHyderabadLife StyleMahabubabadNational NewsPoliticsSpot NewsTechnologyTelangana

పినపాక అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ కోసం ఈవీఎంలు సిద్ధం

పినపాక అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ కోసం ఈవీఎంలు సిద్ధం

పోలింగ్ సామగ్రి కమిషనింగ్ పర్యవేక్షించిన ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్

✍️ దివిటీ మీడియా – మణుగూరు (మే 5)

మహబూబాబాద్ (ఎస్టీ) పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పినపాక(ఎస్టీ) అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్
కోసం ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి సర్వం సిద్ధమైంది. మణుగూరులోని జిల్లాపరిషత్ హైస్కూల్లో ఆదివారం జరిగిన పోలింగ్ సామగ్రి సంసిద్ధత ప్రక్రియను ఐటీడీఏ పీఓ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ పర్యవేక్షించారు. 250 పోలింగ్ స్టేషన్లకు గాను ఈవీఎం లను కమిషనింగ్ చేసి స్ట్రాంగ్ రూంలో భద్రపరచినట్లు ఆయన వెల్లడించారు. స్ట్రాంగ్ రూములో భద్రపరిచిన ఈవీఎంలను ప్రజా ప్రతినిధులు, భద్రతా సిబ్బంది సమక్షంలో తాళాలు తీసి ఈవీఎం మిషన్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు సక్రమంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. ఈ సందర్భంగా మొత్తం 30 సెక్టార్లు ఏర్పాటు చేసి, సెక్టార్ అధికారులు, పీఓలు, ఏపీఓలు, సిబ్బంది సహకారంతో సెక్టర్, పోలింగ్ కేంద్రం వారీగా కమిషనింగ్ చేసి డిస్ట్రిబ్యూషన్ కు సిద్ధం చేసి, స్ట్రాంగ్ రూములో భద్రపరచామన్నారు. 624 బ్యాలెట్ యూనిట్లు, 312 కంట్రోల్ యూనిట్లు, 350వీవీ ప్యాట్లు, రిజర్వ్ మిషన్ తో కలుపుకుని, ఇంజనీర్ల సమక్షంలో జాగ్రత్తగా పరిశీలించారు. 23 మంది అభ్యర్థులకు ఓట్లు వేసే బ్యాలెట్ పేపర్ అంటించి, మిషన్లన్నీ సక్రమంగా పనిచేస్తున్నదీ, లేనిదీ పరిశీలించి, జాగ్రత్తగా సీలు వేసి స్ట్రాంగ్ రూముకు చేరవేసినట్లు ప్రతీక్ జైన్ తెలిపారు. సెక్టోరల్ ఆఫీసర్లు, పీఓలు ,ఏపీఓలు, సహాయక సిబ్బంది, పోలింగ్ తేదీకి ముందురోజు ఈవీఎంలను, పోలింగ్ సామగ్రిని తీసుకుని వెళ్లేటప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూం తెరుస్తామని వివరించారు. అప్పటివరకు సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసుల రక్షణలో 24 గంటలూ కాపలా కాయడంతో పాటు, స్ట్రాంగ్ రూం పరిసరాలు, స్ట్రాంగ్ రూం దగ్గర సీసీ కెమెరాల నిఘా నీడలో భద్రంగా ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ఎన్నికల విధులలో పాల్గొంటున్న సిబ్బంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎలక్షన్ డీటీ నాగరాజు, ఈవీఎం నోడల్ ఆఫీసర్ ముజాహిద్, ఆర్ఐ కృష్ణ, ఐటీడీఏ అగ్రికల్చర్ ఏడీ భాస్కర్, డీటీ (ఆర్ఓఎఫ్ఆర్) శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, ఐటీడీఏ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ పాలాభిషేకం

Divitimedia

పొంగులేటి చొరవతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల

Divitimedia

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పొంగులేటి

Divitimedia

Leave a Comment