కలపలారీని ఢీకొట్టిన టిప్పర్, ఇద్దరికి గాయాలు
దివిటీ మీడియా
✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు (మే 4)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మర్రికుంట వద్ద కలపలోడుతో వెళ్తున్న లారీని కంకరలోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికుల కథనం ప్రకారం ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి తర్వాత జరిగింది. ఈ ఘటనలో టిప్పర్ లారీ డ్రైవర్, క్లీనర్ గాయాల పాలైనట్లు తెలిసింది. మోరంపల్లిబంజర వారపుసంత దాటిన తర్వాత మర్రికుంట గ్రామ సమీపాన ఈ ప్రమాదం జరిగింది. ఏపీ కృష్ణా జిల్లా నందిగామ నుంచి కలప లోడుతో సారపాక వెళ్తున్న లారీని కంకర లోడుతో వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. వేగాన్ని అదుపు చేయలేక టిప్పర్ లారీ డ్రైవర్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆ తీవ్రతకు ముందున్న కలపలారీ లోని కలప వెనుక ఢీకొట్టిన టిప్పర్ క్యాబిన్, వెనుక కంకర లోడు మీదకు వెళ్లిపోయింది. గాయాల పాలైన డ్రైవర్, క్లీనర్ చికిత్స పొందుతున్నారు.