Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleSpot NewsTechnologyTelanganaYouth

నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపై చీటింగ్ కేసులు : డీఎస్పీ రెహమాన్

నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపై చీటింగ్ కేసులు : డీఎస్పీ రెహమాన్

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం నేరవిభాగం, మార్చి 29

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలను సీజ్ చేసి, సంబంధిత వాహనదారులపై చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగూడెం వన్ టౌన్, టూటౌన్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాల కోసం శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు.ఇందులో భాగంగా కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన ఇద్దరిపై, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురిపై చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. చైన్ స్నాచింగ్, దొంగతనాయలకు పాల్పడే నేరస్తులు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు ఉపయోగిస్తున్నారని, అలాంటి నేరాల నియంత్రణ, ఛేదనన కోసం ఈ విధంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాలలో నెంబర్ ప్లేట్లు లేకుండా గానీ, నెంబర్ ప్లేట్లు టాంపర్ చేసిన వాహనాలపై గానీ ప్రయాణిస్తూ ఎవరైనా పట్టుబడితే వారిపై చీటింగ్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నేరాల నియంత్రణకు పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్, 3టౌన్ సీఐ శివప్రసాద్, ట్రాఫిక్ ఎస్సైలు నరేష్, మదార్, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మిగిలిన నాలుగు గ్యారెంటీలు కూడా 100 రోజుల లోపు అమలు చేస్తాం

Divitimedia

ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించిన కేంద్రం

Divitimedia

కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశ్వనీవైష్ణవ్‌

Divitimedia

Leave a Comment