ఐఎన్టీయూసీ మిత్రపక్షాల కేలండర్ ఆవిష్కరించిన ఐటీసీ ఉన్నతాధికారులు
✍🏽 దివిటీ – బూర్గంపాడు (జనవరి 3)
బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పి.ఎస్.పి.డి కర్మాగారంలో ఐ.ఎన్.టి.యు.సి నూతన సంవత్సరం 2024 కేలండర్ ను బుధవారం యూనిట్ హెడ్ సిద్ధార్థ మహంతి చేతులమీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర నాయకుడు మారం వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం లాగే ఈ 2024 సంవత్సరంలో కూడా కార్మిక సోదరులందరూ భద్రత పాటిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది కంపెనీ అభివృద్ధి చెంది 8వ ప్లాంట్ ఇక్కడే భద్రాచలంలో త్వరగా ప్రారంభించే విధంగా యూనిట్ హెడ్ మహంతి కార్పొరేట్ స్థాయిలో చర్చించాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవ వనరుల (హెచ్. ఆర్) విభాగం హెడ్ శ్యామ్ కిరణ్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు గోనె దారుగా, ఐఎన్టీయూసీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు గోనె రామారావు. యారం పిచ్చిరెడ్డి. ఏఐటీయూసీ నాయకుడు సాజిద్. తెలంగాణ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి వీరభద్రరావు, టీఈయూ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి, సెక్రటరీ టి వెంకటేశ్వర్లు, కార్మిక నాయకులు ఎం.ఎస్.ఆర్.బి రెడ్డి, వినోద్, షేక్ అబ్దుల్ సలీం, సాయి, ఎంపీసీ రెడ్డి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.