Divitimedia
Bhadradri KothagudemLife StyleTelangana

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ డా ప్రియాంకఅల, ఎస్పీ డా వినీత్

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ డా ప్రియాంకఅల, ఎస్పీ డా వినీత్

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆచార, సంప్రదాయాలకు ప్రతీకగా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని చాటే పూల పండుగ బతుకమ్మ వేడుకలను 9రోజులపాటు తీరొక్కపూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో పండుగ వైభవోపేతంగా జరుపుకున్నామన్నారు. ఆ అమ్మవారి అశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవిచాలని కలెక్టర్ డా.ప్రియాంక అల ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ ఎస్పీ డా.వినీత్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసిన ఎస్పీ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, దసరా పండుగను జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు తాము చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయాలు చేకూరాలన్నారు.
—————————-
ఈవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు
—————————-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిసోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం ఈసారి విజయదశమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవైనందు వల్ల ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు డీఆర్వో రవీంద్రనాధ్ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలోపేర్కొన్నారు. పండుగ సెలవు కాబట్టి అధికారులు అందుబాటులో ఉండని కారణంగా ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్ కు రావద్దని ఆయన సూచించారు.

Related posts

గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్

Divitimedia

‘ఆర్సీఓ’గా బాధ్యతలు చేపట్టిన అరుణకుమారి

Divitimedia

వరదల్లో ప్రాణరక్షణ కోసం అగ్రికల్చర్ డ్రోన్లు

Divitimedia

Leave a Comment