Divitimedia
Bhadradri KothagudemPoliticsTelanganaWomen

మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల

మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

భద్రాచలంలో ఈ నెల 30వ తేదీ, శనివారం
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రోడ్లు,భవనాలశాఖమంత్రి ప్రశాంత్ రెడ్డి భద్రాచలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం రాత్రి భద్రాచలం పట్టణంలో టొబాకో కంపెనీలోని హెలిప్యాడ్ ప్రాంతం, కూనవరం రోడ్డులో శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని, అంబేద్కర్ సెంటర్, చర్ల రోడ్డులో కె.కె.ఫంక్షన్ హాల్ ప్రాంతాల్లో స్థానిక ఏఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ, కార్యక్రమాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు భద్రాచలం చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీపీఓ రమాకాంత్, ఆర్డీవో మంగీలాల్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రగతి విద్యానికేతన్ లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు

Divitimedia

డాక్టర్ విజేందర్రావుకు రోటరీ నేతల ఘన నివాళి

Divitimedia

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాలు

Divitimedia

Leave a Comment