Divitimedia
Bhadradri KothagudemPoliticsTelangana

సీఎం కేసీఆర్ ను కలిసిన జడ్పీటీసీ శ్రీలత దంపతులు

సీఎం కేసీఆర్ ను కలిసిన జడ్పీటీసీ శ్రీలత దంపతులు

వరదనష్ట నివారణ చర్యల పరిశీలనకు సీఎం కేసీఆర్ హామీ

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

హైదరాబాదులోని ప్రగతిభవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను బూర్గంపాడు జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత-రామకొండారెడ్డి దంపతులు ఆదివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా తాము బూర్గంపాడు మండలం నుంచి వచ్చినట్లు తాము వచ్చినట్లు తెలియజేయగా, సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి, ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ లు తనతో గోదావరి వరదల గురించి చర్చించినట్లుగా గుర్తు చేసుకున్నారు. వరద నష్టం నివారణ చర్యల కోసం కొన్ని ప్రతిపాదనలు తమవద్ద పరిశీలనలో ఉన్నాయని, వాటిని త్వరలోనే పూర్తిచేసి, ఆ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉంటామని సీఎం కేసీఆర్ తెలియజేశారని ఈసందర్భంగా జడ్పీటీసీసభ్యురాలు శ్రీలత, రామకొండారెడ్డి దంపతులు పేర్కొన్నారు. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో వరదల నష్టనివారణ చర్యలు తీసుకుంటామంటూ సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ కు వారు ధన్యవాదాలు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గంజాయి, మత్తు పదార్థాలు గుర్తించేందుకు పోలీస్ జాగిలాలు

Divitimedia

ముక్కోటి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

Divitimedia

ఇళ్లమధ్యలో ‘చెరువులు’… మరెవరో బాధ్యులు…?

Divitimedia

Leave a Comment