Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadKhammamLife StyleSpot NewsTelangana

రేషన్ డీలర్ నుంచి లంచం తీసుకుంటూ…

రేషన్ డీలర్ నుంచి లంచం తీసుకుంటూ…

ఏసీబీకి పట్టుబడిన డీటీ, మరో ఇద్దరు

✍️ దివిటీ – ఇల్లందు, (నవంబరు 17)

రేషన్ దుకాణంలో గుర్తించిన అవకతవకలను ఆసరా చేసుకున్న డీటీ (డెప్యూటీ తహసీల్దారు), వాటిపై రిపోర్ట్ పంపి సదరు రేషన్ డీలర్ మీద చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం తీసుకుంటున్న ఘటన సోమవారం వెలుగు చూసింది. ఈ మేరకు ఇల్లందు మండలంలో ఓ రేషన్ డీలర్ వద్ద నుంచి రూ.30,000 లంచం తీసుకుంటూ డెప్యూటీ తహసీల్దారు మహమ్మద్ యాకూబ్ పాషా సోమవారం ఏసీబీకి పట్టుబడ్డారు. పని వేళల్లో ఆ దుకాణం మూసివేయడంతో పాటుగా, ఉండాల్సిన దానికంటే రేషన్ తక్కువ స్టాక్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గుర్తించిన ఈ  అవకతవకలపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపించకుండా ఉండేందుకు ఆ డీలర్ నుంచి డీటీ యాకూబ్ పాషా, జీసీసీ టెక్నికల్ అసిస్టెంట్(ఇపాస్)  విజయ్ కుమార్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఈ కేసులో బాధిత రేషన్ డీలర్ ఫిర్యాదు మేరకు వారు ఇల్లందు మండల రేషన్ దుకాణ డీలర్ల అధ్యక్షుడు పోతు శబరీష్ ద్వారా  రూ.30వేలు లంచం తీసుకుంటుండగా  ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వ సేవకుడైనా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేసి సంబంధిత సమాచారం అందించాలని కోరారు. దీనితోపాటు వాట్సాప్ నెంబర్ : 9440446106,  ఫేస్ బుక్ అకౌంట్  Telangana ACB,  ఎక్స్ అకౌంట్  @TelanganaACB,  వెబ్ సైట్ ‘acb.telangana.gov.in‘ ల ద్వారా కూడా సంప్రదించవచ్చునని తెలిపారు.
“ఫిర్యాదుధారులు / బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు.

Related posts

జనక్ ప్రసాద్ ను అభినందించిన ఐఎన్టీయూసీ నాయకులు

Divitimedia

మహిళల రక్షణే షీటీమ్స్ ప్రధాన లక్ష్యం : ఎస్పీ డా.వినీత్

Divitimedia

‘ప్రజాస్వామిక దృక్పథం కలిగిన పౌరులే నిజమైన దేశభక్తులు’

Divitimedia

Leave a Comment