Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTelanganaYouth

పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు

పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు

✍️ కొత్తగూడెం – దివిటీ (జులై 15)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు తాజాగా నిధులు మంజూరయ్యాయి. జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మతులకు, మౌలిక సదుపాయాల కోసం రూ.3.31కోట్లు విడుదల చేసినట్లు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి హెచ్.వెంకటేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అదేవిధంగా ప్రతి కళాశాలకు రూ.10వేల చొప్పున క్రీడాసామాగ్రి కొనుగోలు కోసం, కళాశాల మెయింటెనెన్స్ కోసం 14 కళాశాలకు రూ.3.16లక్షలు విడుదల చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన హర్ష వ్యక్తం చేశారని కూడా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితా అందించండి

Divitimedia

మహిళలపై అత్యాచారాలు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం

Divitimedia

‘ముక్తార్ పాషా, పైలా చంద్రక్కల అమరత్వం మహోన్నతం’

Divitimedia

Leave a Comment